టీజర్ వచ్చేస్తోంది “డ్యూడ్”

మల్టీ టాలెంటెడ్ తేజ్ నటిస్తూ కన్నడ – తెలుగు – మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న “డ్యూడ్” చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!

హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ… “హీరోగా, డైరెక్టర్ గా ‘డ్యూడ్” చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం” అని అన్నారు!!

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష… ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు!!

పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీత సారధి. “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్!!

Tfja Team

Recent Posts

31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న ‘నమస్తే వరల్డ్..!

· కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాల ఏర్పాటుతో 1,050 మందికి ఉపాధి అవకాశాలు ·…

1 day ago

హీరో సుధాకర్ కోమాకుల ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల !!!

శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…

3 days ago

‘హల్కా డాన్’గా ‘లెనిన్’లో విలక్షణ నటనతో మెప్పించిన ప్రమోద్.. అదిరిపోయిన మాస్ ఫస్ట్ కట్ టీజర్..!

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…

3 days ago

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్..!

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…

3 days ago

“మాయలేడి” కొత్త తరహా మ్యూజికల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, ఆడియెన్స్ మా సినిమాను ఇష్టపడతారని నమ్ముతున్నాం – హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే..!

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే…

3 days ago