వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.
నటీనటులు:
వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాత- గూడూరు ప్రణయ్ రెడ్డి,
దర్శకత్వం – విక్రాంత్ కుమార్,
సినిమాటోగ్రఫీ – సాయి చైతన్య మాటేటి,
మ్యూజిక్ – సునీల్ కశ్యప్,
ఎడిటర్ – మార్తాండ్ కె.వెంకటేష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ మద్దిరాల,
లైన్ ప్రొడ్యూసర్ – ఎన్.మురళీధర్ రావు,
ప్రొడక్షన్ కంట్రోలర్ – వాసు
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…