శ్రీవిష్ణు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘శ్వాగ్’ నుంచి ‘రేజర్’ టీజర్ రిలీజ్

వెరైటీ సబ్జెక్ట్‌లతో అలరిస్తున్న శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ కంటెంట్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి సినిమాలోనూ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకుంటూ డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. హసిత్ గోలీ దర్శకత్వంలో చేస్తున్న తన అప్ కమింగ్ యూనిక్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’లో హిలేరియస్ రోల్ లో కనిపించనున్నారు. శ్వాగ్ శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ అటెంప్ట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన తర్వాత మేకర్స్ రేజర్ టీజర్ ని రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు మగవారి గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వీడియో ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు భవభూతి అనే మగ చావినిస్ట్ క్యారెక్టర్ పోషించారు. అతని లుక్స్, టెర్రిఫిక్ మేక్ఓవర్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

శ్రీవిష్ణు అద్భుతమైన చరిష్మా తో అందరిద్రుష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతని క్యారెక్టర్  ప్రేక్షకులను రెండుగా డివైడ్ చేస్తుంది. అతన్ని ప్రేమించినా, ద్వేషించినా, మీరు భవభూతిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. టీజర్ హైలీ ఎంటర్టైనింగ్ గా ఉంది. హసిత్ గోలీ రైటింగ్ హిస్టీరికల్‌గా ఉంది, అతని డైరెక్షన్ అద్భుతంగా ఆకట్టుకుంది.

వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్. నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. శ్వాగ్ విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత:  టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

17 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

18 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago