మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ ఎవైటెడ్ మోస్ట్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అయిన చికిరి చికిరి ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది, లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచింది. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే దర్శకుడు బుచ్చి బాబు సాన, ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్‌తో పని చేయడం తన కల నెరవేరినట్టుగా చెప్పారు. రహ్మాన్‌పై ఆయనకున్న అభిమానాన్ని ఈ ప్రమోలోనే చూపించారు. పాట సిట్యుయేషన్ రహ్మాన్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆయన ఈ పాటని సిట్యుయేషన్ తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచారు.
పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం వేడుక చేసుకుంటాడు. ఈ బ్యూటీఫుల్ ఫీలింగ్స్ ని లిరిసిస్ట్ బాలాజీ తన సాహిత్యంలో ఎంతో అద్భుతంగా మలిచారు.
ఏఆర్ రహ్మాన్ సంగీతం అద్భుతంగా వుంది. ఫోక్ ఎనర్జీ, మోడర్న్ బీట్‌లతో కంపోజ్ చేసిన చికిరి అదిరిపోయింది. గాయకుడు మొహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాటకు జీవం పోశారు. జాని మాస్టర్ కొరియోగ్రఫీతో పాట విజువల్స్ మరింత బ్యూటీఫుల్ గా మారాయి.
రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, రిథమ్, హ్యాపీనెస్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వున్నాయి. ఆయన హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ప్రేమను సెలబ్రేట్ చేస్తున్న అనుభూతి ఇస్తోంది.
జాన్వీ కపూర్ ఇంట్రో షాట్ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆమె దీపాన్ని ఎత్తి తన లుక్‌ని రివీల్ చేసే సీన్ మ్యాజిక్ లా ఉంది. ఆమె గ్రేస్, చార్మ్ అద్భుతంగా వుంది.
పాట ట్యూన్, లిరిక్స్, విజువల్స్, ఎనర్జీ అన్నీ కలిపి“చికిరి చికిరి”ను నెక్స్ట్ పాన్-ఇండియా వైరల్ సాంగ్‌గా నిలబెట్టాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ ఛాలెంజ్‌లకు ఇది పర్ఫెక్ట్ సాంగ్. చికిరి ‘పెద్ది’ మ్యూజికల్ జర్నీకి బ్లాక్‌బస్టర్ స్టార్ట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.
పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…