విరాట్ కర్ణ, శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ పెదకాపు-1 థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల
యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండటంతో మ్యూజిక్ ప్రమోషన్‌లు చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమైయ్యాయి, టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ డేడ్ కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియోలో సినిమాలోని కోర్ పాయింట్‌ను తెలియజేసేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ వీడియోను విడుదల చేశారు.
పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.
ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్.
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
సంగీతం – మిక్కీ జె మేయర్
డీవోపీ – చోటా కె నాయుడు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ – రాజు సుందరం
ఆర్ట్- జిఎం శేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…