డిసెంబర్ 11న విడుదలకు సిద్ధమైన ‘ప్యారడాక్స్ హరికథ’.. రొమాంటిక్ మెలోడీ ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ విడుదల!

  • డిసెంబర్ 11 న ‘పారడాక్స్ హరికథ’ చిత్రం విడుదల….‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్*

ఐరావత సినీ కలర్స్, అ‌గ్‌మైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ల మీద కడ్లూరి అశోక్ , రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర నిర్మించిన చిత్రం ‘పారడాక్స్ హరికథ’. ఈ సినిమాకి అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని బుధవారం నాడు విడుదల చేశారు.ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

నటుడు కేదార్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ చిత్రంలోని విజువల్స్ చూశాను. హీరో, హీరోయిన్లు బాగున్నారు. చిన్న చిత్రాలు పెద్ద హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు అంబరీష్ మాట్లాడుతూ .. ‘హిస్టారిక్‌లోని మూమెంట్‌ని తీసుకుని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పారడాక్స్ హరికథ’ను తెరకెక్కించారు. ఇందులో మంచి మెసెజ్ ఉంటుందోని అర్థం అవుతోంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ సాంగ్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా నిర్మాతలకు థాంక్స్.
ఈ హరికథ సినిమా వినూత్నమైన సినిమా అని, తెలుగు చిన్న చిత్రాల హిట్ జాబితాలో ఈ సినిమా కచ్చితంగా చేరుతుందని, తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు రాని ఒక కొత్త తరహ అంశం ఉందన్ని , అది ప్రేక్షకులకు కొత్త తరహ అనుభూతి ఇస్తుందని తెలుపుతూ డిసెంబర్ 11న రిలీజ్ అవుతున్న సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరారు.

నిర్మాత అశోక్ కడ్లూరి మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ గొప్ప చిత్రంగా నిలుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీ కోసం అందరూ కష్టపడి పని చేశారు. అన్ని రకాల హంగులతో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని తెలిపారు.

లావణ్య రెడ్డి మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ కోసం టీం అంతా కలిసి ఎంతో కష్టపడ్డాం. మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాం. రిలీజ్ విషయంలో మేం సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ‘హరికథ’లో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’కు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ కోసం అనుదీప్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుంది’ అని అన్నారు.

నటుడు కిరణ్ మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ జర్నీలో అనుదీప్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. కథ విన్న వెంటనే నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి కథ రావాలని ప్రతీ ఒక్క యాక్టర్ అనుకుంటారు’ అని అన్నారు.

అఖిల రామ్ మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’ అద్భుతంగా వచ్చింది. ‘మసూద’లో నన్ను ముసుగులో చూసి ఉంటారు. ఇప్పుడు ముసుగు తీసి వస్తున్నాను. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు మన్యం భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘పారడాక్స్ హరికథ’లో అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్ర బాగుంటుంది. గతాన్ని, వర్తమానాన్ని చక్కగా లింక్ చేశారు. అందరూ సినిమాని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

TFJA

Recent Posts

హీరో సుధాకర్ కోమాకుల ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల !!!

శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…

8 minutes ago

‘హల్కా డాన్’గా ‘లెనిన్’లో విలక్షణ నటనతో మెప్పించిన ప్రమోద్.. అదిరిపోయిన మాస్ ఫస్ట్ కట్ టీజర్..!

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…

11 minutes ago

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్..!

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ బాయ్స్‌’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…

15 minutes ago

“మాయలేడి” కొత్త తరహా మ్యూజికల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్, ఆడియెన్స్ మా సినిమాను ఇష్టపడతారని నమ్ముతున్నాం – హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే..!

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే…

23 minutes ago

“ఇడుపు కాయితం” నవ్విస్తూ, ఆలోచింపజేసే మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం- టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్..!

డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్…

37 minutes ago