పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ ట్రైలర్ రిలీజ్

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. తాజగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. కన్నడ స్టార్ రవిచంద్రన్, బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

 ”నా పేరు సిద్ధు. నేనొక ఆస్ట్రోనాట్. ఐయామ్ ఎ టైమ్, ట్రావెలర్ అండ్ ఐ హేవ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్” అని హీరో జైద్ ఖాన్ వాయిస్ తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో బనారస్  విజువల్స్ ని చూపించిన తర్వాత జైద్ ఖాన్ స్టయిలీష్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేషాలు బ్యూటీఫుల్ గా వున్నాయి. హీరోయిన్ కి హీరో ”నేను నీ ఫ్యచర్ భర్త’ని చెప్పడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ సెకండ్ హాఫ్ లో టైం ట్రావెల్ ఎలిమెంట్ ని పరిచయం చేసిన తర్వాత ఎక్సయిటింగ్ సన్నివేశాలు థ్రిల్ చేశాయి. దిని తర్వాత వచ్చిన యాక్షన్ సీన్స్ బ్రిలియంట్ గా వున్నాయి. ఈ ట్రైలర్ తో బనారస్ పై చాలా క్యూరీయాసిటీ పెరిగింది.

జైద్ ఖాన్ తన స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు. జైద్ ఖాన్, సోనాల్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ట్రైలర్ లో చూపించిన తొలితొలి వలపే పాట రొమాంటిక్ గా ఆకట్టుకుంది.  దర్శకుడు జయతీర్థ తన స్క్రీన్ ప్లే తోమ్యాజిక్ చేశారని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపధ్య సంగీతం యాక్షన్ మరింత థ్రిల్ ని ఇచ్చింది. అద్వైత గురుమూర్తి కెమరాపనితనం రిచ్ గా వుంది.

ఎన్ కె ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. పాన్ ఇండియా మూవీగా  వస్తున్న బనారస్ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జైద్ ఖాన్ మాట్లాడుతూ .. నన్ను ఆశీర్వదించడానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన రవిచంద్రన్ గారు, అర్బాజ్ ఖాన్  గారికి కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. చాలా అనందంగా వుంది. ఈ ప్రయాణంలో చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను నడుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత తిలకరాజ్ బల్లాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నటుడు కావాలనే నా కల ఆయన వలనే నెరవేరింది. దర్శకుడు జయతీర్థ గారికి కృతజ్ఞతలు. మంచి టీమ్ వర్క్ తో చేసిన చిత్రమిది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ప్రేక్షకులకు వినోదం పంచుతానని మాటిస్తున్నాను. పాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

రవిచంద్రన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి  జైద్ ఖాన్ కు స్వాగతం. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకు అనుభవం వున్న నటుడిలా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు జైద్. ట్రైలర్ చాలా ఎక్సయిట్ గా వుంది. చాలా క్యూరీయాసిటీని పెంచింది. బనారస్ యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విశేష్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించి జైద్ కి గొప్ప ఆరంభం ఇవ్వాలి” అని కోరారుఅర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతన్న జైద్ కి నా బెస్ట్ విశేష్.  ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సయిటింగా వుంది. టైం ట్రావెల్ ఎలిమెంట్ చాలా క్యూరీయాసిటీని పెంచింది. ఈ సినిమా కోసం బనారస్ టీమ్ ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి” అని కోరారుసతీష్ వర్మ మాట్లాడుతూ.. జైద్ నాన్నగారు నాకు మంచి స్నేహితులు. ఈ సినిమాని తెలుగు విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుంది. బలమైన కంటెంట్ వున్న సినిమా ఇది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో భాగం కావడం మరింత ఆనందంగా వుంది. జైద్, బనారస్ టీంకు ఆల్ ది బెస్ట్” తెలిపారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

1 day ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago