ఆగష్టు 9న వస్తున్న “పాగల్ వర్సెస్ కాదల్” చిత్రం

ఘనంగా “పాగల్ వర్సెస్ కాదల్” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ

విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “పాగల్ వర్సెస్ కాదల్”. ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ – మీడియా మిత్రులకు నమస్కారం. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రెస్ మీట్ కు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించింది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ విషిక మాట్లాడుతూ – అందరికీ నమస్కారం. పాగల్ వర్సెస్ కాదల్ సినిమాలో నేను ప్రియ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ ను తను తన అనుమానంతో ఇబ్బందులు పెడుతుంటుంది. నా క్యారెక్టర్ చూసి మేము మా బాయ్ ప్రెండ్స్ ను ఇంత ఇబ్బంది పెట్టం అని అమ్మాయిలు అనుకుంటారు. నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అని చెప్పారు.

నటీనటులు – విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్, డీఐ – శ్యామ్ కుమార్.పి.
సినిమాటోగ్రఫీ – నవధీర్
మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల
బ్యానర్ – శివత్రి ఫిలింస్
పీఆర్ఓ – కడలి రాంబాబు ,దయ్యాల అశోక్,
నిర్మాత – పడ్డాన మన్మథరావు
రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago