ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ‘మార్క్ మీడియా’ నుండి ‘ఆస్థి మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్ష కాపీల పంపిణీకి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ సంచికను రామోజీ ఫిలింసిటీలో గురువారం సాయంత్రం హీరో సాయి ధరమ్ తేజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..
పవన్ కళ్యాణ్ గారిపై ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికను అభిమానులందరూ తప్పకుండా చదవాలని కోరారు. ఈ ప్రత్యేక సంచికలో పవన్ కళ్యాణ్ గారి ఉద్ధేశాలు, రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడినటువంటి శ్రమ, భవిష్యత్తు తరాల అభివృద్ధి పట్ల ఆయన వ్యూహాలు తదితర అంశాలతో సుమారు 25 మంది సీనియర్ జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్‌తో రూపొందుతున్న ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ శ్రీ ప్రభుగారు మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై ఎడిటర్ అండ్ పబ్లిషర్ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి ప్రత్యేక అభిమానంతో రూపొందించిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎడిటర్ అండ్ పబ్లిషర్ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డిగారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌గారిపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఈ పత్రికను మీ ముందుకు తీసురావడం జరిగిందని, యువత ఆయన గురించి మరింత తెలుసుకొని అనుసరించాల్సి విషయాలు ఎన్నో ఉన్నాయని, భవిష్యత్ తరాలపట్ల ఆయన పడుతున్న తపన చేస్తున్నటువంటి వ్యూహరచన తెలుసుకొని అనుసరించాలని, ఆయనలా ఆలోచించే నాయకులు బహు అదురు అని, ఆయనకు ప్రతి ఒక్కరూ తమ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
ఎంతో మంది శ్రమకోర్చి రూపొందిన ఈ పత్రికలో తను భాగస్వామిని అవుతానని పవన్ కళ్యాణ్ అభిమాని వీడియో గ్రాఫర్ చంద్ర తక్షణ స్పందనతో రూ. 20 వేలు విరాళం ప్రకటించారు. హీరో సాయి ధరమ్ తేజ్ అయనను ప్రత్యేకంగా అభిమానించారు.
ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్, మార్క్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్‌లు ప్రభు, సముద్రాల సురేంద్రరావు, పరిటాల రాంబాబు, మధు, రాయుడు గణపతి, ఫిలిం డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మరియు ఇతరులు పాల్గొన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…