ఆర్మాక్స్‌ రేటింగ్‌లో ‘SIT(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)’ మూవీకి టాప్ ప్లేస్

Must Read

ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. యంగ్ హీరో అరవింద్ కృష్ణ మల్టీ-షేడ్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.

ఆర్మాక్స్ రేటింగ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడిన, అత్యధికంగా వీక్షించబడిన తెలుగు చలనచిత్రాలు/వెబ్ సిరీస్ జాబితాలో SIT అగ్రస్థానంలో ఉంది. భారీ పోటీ ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్‌గా సాగే ఈ SIT 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. ఎంతో ఛాలెంజింగ్‌ కారెక్టర్ అయినా చక్కగా నటించి మెప్పించారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో చిత్రం “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే విడుదల కానుంది.

Latest News

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో...

More News