జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “ఆపరేషన్ అరుణారెడ్డి”. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి. ఈ కార్యక్రమంలో

నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ – ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు గారు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు..ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. వాళ్లందరికీ నచ్చే చిత్రమిది.

వంద చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే రాసిన అనుభవం నాకుంది. అలాగే ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను ఏం చేయగలనో అదే ఈ చిత్రంలో చేశాను. రఘునందన్ రావు గారు అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది. రఘునందన్ రావు గారు కూడా కథ విని బాగుంది మురళి నేను చేస్తా అన్నారు. ఈ సినిమాతో ఆయనకు ఇంతే సంబంధం. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉంది. అతన్ని డీఎంకే, ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయంగా బెటర్ అనుకున్నవారికి సపోర్ట్ చేశా. ఈ క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు, చిరంజీవి, జగన్ ఇలా అందరి నాయకులకు సహకారం అందించా. అయితే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఏ పదవులూ తీసుకోలేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా పనిచేశా. అది కూడా నంది అవార్డ్స్ ను సక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం కోరితే ఆ పదవి తీసుకున్నా. నా అధ్వర్యంలో నిర్వహించిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని అప్పటి విపక్ష మీడియా కూడా అభినందించింది. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ – ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రంలో పోసాని గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం వల్ల కేవలం నటన మాత్రమే కాదు డెడికేషన్, సినిమాను కొత్తగా చూసే విధానం నేర్చుకున్నాను. పోసాని గారు ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ ఒక పవర్ ఫుల్ వుమెన్, సెన్సిటివ్, ఎమోషనల్ ను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు డైలాగ్స్, అరుణ పాత్ర స్వభావం ఎలా ఉండాలి అనేది పోసాని గారు ఎంతో సహనంతో నేర్పించారు. ఇలాంటి మంచివారితో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు

నటీనటులు – పోసాని కృష్ణమురళి, రఘునందన్ రావు, హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, సాయి మణికంఠ, తదితరులు

టెక్నికల్ టీమ్

సమర్పణ – 3 ఇడియట్స్ మూవీస్
బ్యానర్ – యుపి సినిమా లైన్స్, కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్
డీవోపీ – సుధాకర్
మ్యూజిక్ – మహదేవ్ ఏలేందర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్, నిర్మాణం, దర్శకత్వం – పోసాని కృష్ణమురళి

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago