‘ఒదెల 2’ రెండవ షెడ్యూల్ ప్రారంభం, గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒదెల 2’. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది క్రియేటర్ గా, ఓదెల రైల్వే స్టేషన్ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మహా శివరాత్రి నాడు విడుదలైన ‘భైరవి’ నాగ సాధువుగా సూపర్ స్టార్ తమన్నా భాటియా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్, అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ మల్టీ లాంగ్వేజ్  సూపర్ నేచురల్ విజువల్ వండర్ భారతదేశంలోని వివిధ అద్భుతమైన ప్రదేశాలలో తన మొదటి షూట్ షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మహాదేవ్ పరమశివుని దివ్య ఆశీస్సులతో ఆయన పవిత్ర నివాసం వారణాసిలో మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభ షెడ్యూల్‌లో వారణాసి, హైదరాబాద్, భూధాన్ పోచంపల్లి, పోతారం, టంగటూర్  ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.

 రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతోందని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ షెడ్యూల్‌ 20-25 రోజుల పాటు జరుగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణం, కీలక సహాయ నటీనటులతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది యూనిట్.

ఈ చిత్రంలో తమన్నా భాటియాతో కలిసి హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర ప్రముఖ ప్రతిభావంతులతో సహా నటీనటుల నటిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన స్కోర్‌తో తమన్నా పాత్రలోకి మారడాన్ని చూపించే వర్కింగ్ వీడియో గూస్‌బంప్‌లను అందిస్తుంది.

ఓదెల మల్లన్న ఆశీస్సులతో రెండవ షూట్ షెడ్యూల్ జరుగుతుండగా, గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే “ఒదెల 2” మేకింగ్ గురించి రెగ్యులర్ అప్‌డేట్‌లు చూస్తుంటే సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అర్ధమౌతోంది.  

ప్రతి యుగంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికి చెడును ఎలా గెలుస్తాడో చూపిస్తూ అనే కథాంశంతో  “ఓదెల” ఒక సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అవుతుందని హామీ ఇచ్చింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఉత్కంఠభరితమైన విజువల్స్, అద్భుతమైన సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ లతో  వుండబోతుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ మొదటి ఎడిషన్ ‘ఒడెలా రైల్వే స్టేషన్’ తర్వాత మాఓదెల  ఫ్రాంచైజీకి తిరిగి వచ్చారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

 ఈ చిత్రం చుట్టూ ఉన్న అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమా జాతీయ స్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
DOP: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

17 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

17 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

2 days ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

2 days ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

2 days ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

2 days ago