తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ‘ఓదెల 2’ లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా వున్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్, బీహైండ్ ది స్క్రీన్ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారిగా తమన్నా ఈ సినిమాలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది.
ఓదెల2 చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోంది. టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది.
తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తమన్నా మొదటి సారి ఓదెల విలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ చివరి షెడ్యూల్‌ను రూపొందించడానికి సహకరించిన ఓదెల గ్రామస్తులకు మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
సంపత్ నంది సూపర్ విజన్ లో ఓదెల 2 ఎమోషనల్ డెప్త్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్‌తో నిండిన గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…