‘ఆయ్‌’ మూవీ చూసి ఎన్టీఆర్, బన్నీ మెచ్చుకున్నారు. డైరెక్టర్ అంజి

Must Read

మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌.. తాజాగా ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి అంజి.కే.మణిపుత్ర దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలైంది.  గోదావరి నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలకి ముందు నుంచి మంచి బజ్ అందుకున్న ఈ సినిమా.. విడుదలైన తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటూ.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.

సినిమా చూశాక ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యారు?

సినిమా చూశాక ఎన్టీఆర్ గారు బావుంది.. కామెడీని బాగా డీల్ చేశావు.. క్లైమాక్స్ కూడా చాలా బాగా డీల్ చేశావు అన్నారు. అల్లు అర్జున్ గారి మాటలు మీరు వినే ఉంటారు. అందరూ థియేటర్లకి రావడం లేదు అంటారు కానీ.. మంచి సినిమా వస్తే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని నిరూపించావు. సెకండ్ సినిమా ఎప్పుడు తీస్తున్నావ్ అని మాట్లాడారు.

మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రియక్షన్ ఏంటి..?

మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ. మా ఊర్లో సినిమా ఇంకా బాగా ఆడుతోంది. మా అమ్మానాన్నలకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ ఏదో చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయ్యాక అందరూ వచ్చి మీ అబ్బాయి సినిమా చాలా బాగా తీశాడని చెబుతున్నారు అని ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది.

ఇన్ని డబ్బులు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు..?

నేను కూడా చాలా హ్యాపీ. అసలు పెద్ద సినిమాలు కూడా సరిగ్గా ఆడటం లేదనుకున్న సమయంలో చిన్న సినిమా అయినా అందరూ వచ్చి చూశారు. డబ్బులు ఎక్కువ వచ్చినందుకు నిర్మాత హ్యాపీగా ఫీల్ అవుతారు.

సినిమాలో అన్నీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలేనా..?

సినిమా అందరికీ నచ్చడానికి కారణం సినిమాలో అన్ని రియల్‌గా జరిగేవి. నాగ చైతన్య గారు కూడా అదే అన్నారు. థియేటర్లు అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. దానికి కారణం అన్ని మనకు తెలిసిన పాత్రలు. ముసలాయన క్యారెక్టర్ కానీ అన్ని మా సైడ్ నేను చూసిన పాత్రలు. కొన్ని సీన్లు కూడా నిజంగా నాకు జరిగినవి నేను చూసినవే. అందుకే సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

కథ నార్నే నితిన్ దగ్గరికి ఎలా వెళ్ళింది?

ముందు కథతో చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాను. కానీ కొన్ని కారణాల వల్ల నితిన్ గారిని కలవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన లేకపోతే అసలు సినిమానే లేదు. నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే కూడా దానికి కారణం ఆయనే. సినిమాలో కూడా ఆయన చాలా బాగా నటించారు. ఆయన్ని లైఫ్‌లో మర్చిపోలేను. ఆయన కథ వినే విధానం కూడా చాలా బాగుంటుంది.

అంకిత్, కసిరెడ్డి సినిమాలోకి ఎలా వచ్చారు?

కసిరెడ్డి కలెక్టివ్ డెసిషన్ కానీ అంకిత్ నా ఛాయిస్. అతను బాగా నటిస్తాడు అని తెలుసు. వాసు గారు కూడా షూటింగ్ ముందు డౌట్ పడ్డారు. కానీ రష్ చూశాక ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

మిగతా పాత్రల గురించి కూడా చెప్పండి.

హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. తనకి తెలుగు అర్థం అవుతుంది. కానీ మాట్లాడలేదు. నాకు హిందీ రాదు. అయినా అలానే మాట్లాడేవాళ్ళం. వినోద్ గారిని నేను ఒకసారి చూడగానే వాసు గారికి ఫోటో పంపాను. ఆయన మంచి ఛాయిస్ అన్నారు.

క్యాస్ట్ అనే సెన్సిటివ్ టాపిక్ టచ్ చేశారు. ఇబ్బంది అవ్వలేదా..?

లేదు. సెన్సిటివ్ టాపిక్ అయినా కూడా కామెడీతో నడుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది అవ్వలేదు.

కామెడీలో మీ స్ట్రెంత్ అందరికీ అర్థం అయింది. నెక్స్ట్ ఎలాంటి జోనర్ చేయాలి అని అనుకుంటున్నారు?

నా చేతిలో ఏదీ లేదు అండి. నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. అందులో ఏది ఓకే అయితే అది. నెక్స్ట్ సినిమా అంటే వెంటనే అవ్వదు కదా. ముందు ఒప్పించాలి. ఆ తర్వాతే చేయాలి. ఎలాంటి సీరియస్ టాపిక్ అయినా.. నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే నచ్చుతుంది. నా కథలు కూడా అలానే ఉంటాయి. కానీ కంటెంట్ ఉన్న కథలు తీస్తాను.

ఈమధ్య కామెడీ సినిమాలు తీయడం కూడా కష్టం అయింది కదా?

నేను డైలాగ్ కామెడీ కంటే ఎక్కువగా సిచ్యువేషన్ కామెడీని నమ్ముతాను. నా సినిమాకి అది బాగానే వర్కౌట్ అయింది. నాకు ఒక కథ రాయడానికి కూడా ఎక్కువ రోజులు పట్టలేదు. ఎందుకు అంటే ఇదంతా నేను చూసిన ప్రపంచం కాబట్టి నాకు ఈజీ అయింది. ఇంకొకల రాయాలి అంటే అప్పుడు సమయం పట్టొచ్చు ఏమో.

టైటిల్‌కు ముందు వెనుక ఏమన్నా అనుకున్నారా?

మేం ముందు ఈ సినిమాకు రామాలయం వీధి కలిసేట్టు అనే టైటిల్ పెడదామనుకున్నాము. ఆయ్ అనే టైటిల్ కూడా నేనే చెప్పాను. కానీ లెన్త్ ఎక్కువ ఉంటే బాగుండదని అల్లు అరవింద్ గారు ఆయ్ టైటిల్ ఓకే చేశారు.

ఓటీటీలో డిలీట్ చేసిన సీన్స్ యాడ్ చేస్తారా?

లేదు. ఈ మధ్య ఏదో కొత్త రూల్ వచ్చింది అంట. సినిమా థియేటర్లో ఎంత రన్ టైం ఉంటే ఓటీటీలో కూడా అంతే ఉండాలి. కాబట్టి ఓటీటీలో అయితే యాడ్ చేయటం లేదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం వాసు గారు విడిగా రిలీజ్ చేద్దాం అన్నారు.

షూటింగ్ సమయంలో వాతావరణం కోసం ఇబ్బందులు పడ్డారట..?

అది నిజం. మీరు సినిమా చూసినంత సేపు వాతావరణం వర్షంతో తడిచినట్టు ఉంటుంది.. లేదా అప్పుడే వర్షం పడి ఆరిపోయినట్టు ఉంటుంది. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎండలు వచ్చేవి. దాని కోసం మేము అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పట్టింది. బడ్జెట్ కూడా ఎక్కువ అయింది. ఆ ఎఫెక్ట్ కోసం నేల మొత్తం తడపాల్సి వచ్చేది. ఆకులు చెట్లు కూడా తడపాల్సి వచ్చేది. ఒక కిలోమీటర్ కాబట్టి ఒక వైపు మేము తడుపుతుంటే ఎండ వల్ల ఆరిపోతూ ఉండేది. ఇలా చాలానే ఇబ్బందులు పడ్డాము.

బడ్జెట్ పెరిగిందని అంటున్నారు. సినిమా హిట్ అయింది కదా.. కవర్ అయ్యి లాభాలు వచ్చాయా?

ఫైనాన్షియల్ విషయాలు ఏవే నాకు తెలియదండి. మీరు వాసు గారిని అడగాలి.

పెద్ద సినిమాల మధ్యలో వచ్చిన చిన్న సినిమా మీది. హిట్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది?

ఒక డెబ్యూటెంట్‌గా నేను చాలా హ్యాపీ. నేను మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చెప్పాను. జాతి రత్నాలు సినిమా నా ఇన్స్పిరేషన్. ఆ సినిమా చూసే నేను డైరెక్టర్ అయ్యాను. అలా నా సినిమా ఎవరికైనా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు డైరెక్టర్లు అవ్వడం నాకు కావాలి. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

రిలీజ్ డేట్ మీకు బాగా వర్క్ అవుట్ అయింది కదా?

అందులో నా ప్రేమ ఏం లేదు. నిజానికి నేను కొత్తవాణ్ణి. నన్ను తీసుకువెళ్లి అన్ని సినిమాల మధ్యలో వేస్తున్నారు ఏంటి అని నేను అనుకున్నాను. కానీ అల్లు అరవింద్ గారికి ఉన్న అనుభవం సినిమా మీద ఉన్న నమ్మకంతో ఆయన ఈ డేట్ అనుకున్నారు. లాంగ్ వీకెండ్ కాబట్టి నెక్స్ట్ వీక్ కలెక్షన్లు బాగుంటాయని ఆయన ఉద్దేశం.

మీరు నయన్ సారికని తీసుకునేటప్పుడు గం గం గణేశా సినిమా రిలీజ్ అయిందా?

అప్పటికి తన సినిమా కమిట్ అయింది. అది మాకు తెలుసు. కానీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు.

పెద్ద బ్యానర్‌లో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోతో సినిమా మీకు ఎలా అనిపించింది..?

పెద్ద బ్యానర్  అయినా నాకు అసలు షూటింగ్ సమయంలో కొంచెం కూడా ఒత్తిడికి గురవ్వలేదు. ఏమైనా బడ్జెట్ పెరుగుతుందని షూటింగ్ లేటవుతుందని ఇలాంటివి ఏమన్నా కో డైరెక్టర్‌కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కి తెలుసేమో కానీ.. నా దాకా అయితే ఒక మాట కూడా రాలేదు. ఇంకా బన్నీ వాసు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా తీయగలము. కానీ నీకు ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఇది నీకు లైఫ్ ఇవ్వాల్సిన సినిమా. బాగా తియ్యి అంటూ నన్ను ఎంకరేజ్ చేశారు.

మీరు రాసి నాకు క్లైమాక్స్ మీకు నిజ జీవితంలో జరిగిందా?

నేనెప్పుడూ చూడలేదండి. కానీ అలా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రాశాను. కానీ బన్నీ వాసు గారు అలాంటిది ఒకటి చూశారంట. అందుకే ఆయన బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన ఆ పెళ్లికి కూడా వెళ్లారట. కానీ నేను ఒక కథ రాసుకున్న సమయానికి నాకు అది తెలియదు.

ఈ సినిమా హిట్ అయింది కదా.. మరి నెక్స్ట్ సినిమాకి కూడా అవకాశం ఇస్తారా?

అది మన చేతుల్లో ఉండదండి. మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చితే దాని మీద ఆధారపడి ఉంటుంది.

Latest News

కీర్తి సురేశ్‌ ‘రివాల్వర్ రీటా’ AP/TG రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ రాజేష్ దండా

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్ కీర్తి సురేశ్‌ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రివాల్వర్ రీటా'. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ...

More News