సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఫ్యామిలీ స్టార్ నా కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ నేను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ కే దక్కుతుంది. అన్నారు.
పరశురామ్ తో కలిసి గీత గోవిందం అనే బ్లాక్ బస్టర్ మూవీ చేశారు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది ఫ్యామిలీ స్టార్.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…