సూపర్ హిట్ టాక్, భారీ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పాలీ “బెత్లెహెం కుడుంబ యూనిట్” సినిమా

Must Read

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బెత్లెహెం కుడుంబ యూనిట్” ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీగా దర్శకుడు గిరీష్ ఎ డి రూపొందించారు. ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. నివిన్ పాలీ సరసన మమిత బైజు హీరోయిన్ గా నటించారు.

ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన “బెత్లెహెం కుడుంబ యూనిట్” సినిమాకు మంచి టాక్ రావడంతో టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. బుక్ మై షో లో గంటకు దాదాపు 25 వేల టికెట్ బుకింగ్స్ జరుగుతుండటం విశేషం. ఈ చిత్రంలో జస్టిన్ పాత్రలో నివిన్ పాలీ సాలిడ్ పర్ ఫార్మెన్స్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. గతేడాది సర్వంమాయతో హిట్ కొట్టిన నివిన్ పాలీ ఈ ఏడాది “బెత్లెహెం కుడుంబ యూనిట్”తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఈ ఓనం పండుగ సూపర్ హిట్ గా క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలోని కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి.

Latest News

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్...

More News