నితిన్ 32 చిత్రం `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్`.. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్
టాలెంటెడ్ యాక్టర్ నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. `ఆర్డినరీ మేన్` ట్యాగ్ లైన్. రైటర్ – డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో నితిన్ రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఓ దానిలో ఆయన హెయిర్ స్టైల్, గడ్డంతో సీరియస్‌గా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో మరో లుక్‌లో గడ్డం లేకుండా చాలా కూల్‌గా కనిపిస్తున్నారు నితిన్.
పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ కనిపిస్తుంది. అలాగే క్లాప్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. నితిన్ లుక్ చాలా కొత్తగా ఉందంటున్నారు ఫ్యాన్స్. `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌తో పాటు `ఆర్డినరీ మేన్` అనే ట్యాగ్ లైన్ పోస్టర్‌లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్ తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారని క్లియర్‌గా తెలుస్తోంది.ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ “ఎక్స్‌ట్రా` క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ తర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుంది“ అన్నారు.
మ్యూజికల్ జీనియస్ హరీష్ జైరాజ్ సంగీతం `ఎక్స్‌ట్రా` చిత్రానికి పెద్ద ఎసెట్. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…