భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.

తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందిస్తున్నారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ పవర్‌ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవనున్నాయి.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్/హీ-మ్యాన్‌గా నటిస్తుండగా, కమిలా మెండెస్ టీలా పాత్రలో కనిపించనున్నారు. అలాగే జారెడ్ లెటో స్కెలెటర్ పాత్రలో నటిస్తుండగా, మ్యాన్-అట్-ఆర్మ్స్ పాత్రలో ఇడ్రిస్ ఎల్బా కనిపించనున్నారు.

అలిసన్ బ్రి, మొరెనా బక్కారిన్, క్రిస్టెన్ విగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హీ-మ్యాన్’ ప్రపంచాన్ని కొత్త తరానికి గ్రాండ్‌గా పరిచయం చేయబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా విడుదల చేయనుంది. జూన్ 5వ తేదీన ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో భారత దేశంలో విడుదల కానుంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

6 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago