నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రేసీ థ్రిల్లింగ్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యంగ్ అండ్ డైన‌మిక్ యాక్ట‌ర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. స్వామి రారా, కేశ‌వ వంటి సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్‌ల త‌ర్వాత నిఖిల్, సుధీర్ వ‌ర్మ కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్‌గా ప్రారంభ‌మైన ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇందులో హీరో నిఖిల్ రిషి అనే రేస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. త‌నకు ల‌వ్ స్టోరీస్ ఉంటాయి. రుక్మిణి వ‌సంత‌న్ డ‌బ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్‌తోనూ మ‌రో ప్రేమ క‌థ ఉంటుంది.

రిషికి అనుకోకుండా డ‌బ్బు మ‌రో ప‌ని చేయ‌డానికి ఒప్పుకుంటాడు. దీంతో అస‌లు గంద‌ర‌గోళం ప్రారంభ‌మ‌వుతుంది. ఓ చచ్చిన వ్య‌క్తిని త‌ర‌లించ‌టానికి రిషి సిద్ధ‌మైన‌ప్పుడు ఏం జ‌రుగుతుంది. ఓ వైపు పోలీసులు, మ‌రో వైపు గూండాలు అత‌న్ని వెంబ‌డిస్తారు. చాలా స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. అప్పుడు త‌న రేసింగ్ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇంత‌కీ రిషి ఎవ‌రి డెడ్ బాడీని త‌ర‌లించాల‌ని అనుకున్నాడు? అజ‌య్‌, జాన్ విజ‌య్.. రిషిని వెంబ‌డించ‌టానికి ఏ ప‌రిక‌రాన్ని వాడుతుంటారు? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఇదే ట్రైల‌ర్‌లో స‌త్య‌, సుద‌ర్శ‌న్ పాత్ర‌ల‌ను కూడా మ‌నం చూడొచ్చు. న‌రాలు బిగ‌ప‌ట్టేలా చేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ఉండ‌బోతున్నాయి. సినిమాను ఉత్కంఠ‌భ‌రిత‌మైన యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా తెర‌కెక్కించారు. యాక్ష‌న్‌, రొమాన్స్‌, ఫ‌న్ వంటి అంశాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం  న‌వంబ‌ర్ 8న  ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాతో ఓ స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొంద‌నున్నారు.

 బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెకంటేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి సంస్థ‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ దీన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి ప‌రిచ‌యం అవుతున్నారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్‌, షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం స‌హ నిర్మాత‌లు. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రంలోని పాట‌ల‌కు సంగీతాన్ని అందించ‌గా స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. రిచ‌ర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

10 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

10 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

10 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago