“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” కొత్త పోస్టర్ విడుదల

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

కొత్త పోస్టర్‌లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా ప్రతిబింబిస్తోంది. తన నగరాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్న స్పైడర్-మ్యాన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడని ఈ పోస్టర్ సూచిస్తోంది.

స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్ ఘన విజయానికి నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. ప్రపంచం తనను గుర్తించని పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న పీటర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించడమే తన ధ్యేయంగా మారుతుంది. కానీ కొత్త నేరాల పరంపరతో పాటు అతని జీవితాన్ని కుదిపేసే శక్తివంతమైన శత్రువు రంగంలోకి దిగడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.

సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియా  ఈ చిత్రాన్ని భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనుంది.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

3 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

3 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

3 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago