టాలీవుడ్

“నేను – కీర్తన”తో హీరో గా చిమటా రమేష్ బాబుకు తిరుగులేని పునాది

ట్రైలర్ ట్రెండీగా ఉంది!!

ప్రి-రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్
వేడుకలో అతిధుల ఆకాంక్ష!!

ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు!!

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన “నేను – కీర్తన” చిత్రం ప్రి రిలీజ్ మరియు ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ తోపాటు… ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, “నేను – కీర్తన” చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు. ట్రైలర్ లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తోందని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “నేను – కీర్తన” ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!

హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా “నేను – కీర్తన” చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే… “నేను – కీర్తన” ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, “నేను-కీర్తన” పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ… “ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన “నేను – కీర్తన” కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తనదైన వ్యాఖ్యానంతో అనూష ఈ కార్యకమాన్ని రక్తి కట్టించారు!!

సంధ్య, రేణుప్రియ, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago