NC22 టైటిల్ ‘కస్టడీ’ఫస్ట్ లుక్ విడు దల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగుతమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది.NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22  ప్రాజెక్ట్ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ …  అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి “కస్టడీ”అనే  పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌ లో కనిపించారు.

నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ “ఎ. శివ” పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది.

క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌ లో ప్రజంట్ చేశారు, వెంకట్ ప్రభు తన ప్రతి చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్ ఇవ్వడంలో కూడా దిట్ట. ‘కస్టడీ’ కి ‘ఎ వెంకట్ ప్రభు హంట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. ‘మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక  విభాగం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

సమర్పణ: పవన్ కుమార్

సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్

ఎడిటర్: వెంకట్ రాజన్

డైలాగ్స్: అబ్బూరి రవి

ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్

యాక్షన్: మహేష్ మాథ్యూ

ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

4 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago