గాలోడు విజయం ప్రతీ ఒక్కరిది.. దర్శక, నిర్మాత రాజశేఖర్ రెడ్డి

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాలోడు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మంగళవారం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో…

తమ్మారెడ్డి భరద్వాజ‌ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కష్టాన్ని నమ్మినవాడికి అదృష్టం వస్తుంది అని. సుధీర్ కష్టపడ్డాడు. అదృష్టం కూడా కలిసి వచ్చింది. సుధీర్ ఎంతో సహజంగా నటించారు. ఎంతో సిన్సియర్‌గా యాక్ట్ చేశారు. సినిమాలో ఏదో మంచి థ్రిల్ ఉంది. అందుకే సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఓ మిరాకిల్. సుధీర్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ అయింది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

హీరోయిన్ గెహ్నా సిప్పి మాట్లాడుతూ.. ‘ఆడియెన్స్అంతా కూడా మా సినిమాకు సపోర్ట్ చేశారు. ఇంత మంచి ఆదరణను ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు, నటించేందుకు స్కోప్ ఉన్న ఇంత మంచి కారెక్టర్ రాసినందుకు సంస్కృతి ఫిల్మ్స్, నా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గారికి థాంక్స్. సినిమా కోసం అందరం చాలా కష్టపడి పని చేశాం. సుధీర్ సర్‌కి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మున్ముందు ఎన్నో విజయాలు చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ‘ఇరవై ఏళ్ల నా సినీ ప్రయాణంలో మొదటి సారిగా ఇలాంటి సక్సెస్‌ను చూశాను. దర్శకుడు రాజశేఖర్ రెడ్డిది, నాది ఎన్నో ఏళ్ల బంధం. ఒకే రూంలో ఉన్నాం. తిన్నాం. రాజశేఖర్ రెడ్డికి సుధీర్ తోడయ్యాడు. ఏ నమ్మకంతో నాకు ఈ సినిమా ఇచ్చారో నాకు తెలీదు. కానీ థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక ఎంతో ఆనందం వేసింది. ఇలాంటి ప్రశంసలు, ప్రేమ కోసమే మేం కష్టపడతాం. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు మేం ప్రయత్నిస్తాం. సుధీర్‌ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారందరికీ ఐ లవ్యూ’ అని అన్నారు.

నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘నేను చిన్న సినిమాల ద్వారా ఎదిగాను. చిన్న సినిమాలు తీసేవారికి గాలోడు సినిమా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోయాను. సుధీర్ ఫ్యాన్స్ అంతా కూడా తండోపతండాలు వచ్చి సినిమాను చూస్తున్నారు. ట్రేడ్ ప్రకారం చెబుతున్నా ఈ సినిమా సూపర్ సక్సెస్. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలు రానున్నాయి. నిర్మాతగా, దర్శకుడిగా ఎంతో కష్టపడి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సినిమాను తీశారు. కొందరికి మొదట్లోనే సక్సెస్ వస్తుంది.. ఇంకొందరికి కాస్త ఆలస్యంగా సక్సెస్ వస్తుంది.. కానీ నమ్మకంగా ఉన్న వారికి ఏదో ఒక రోజు కళామతల్లి అన్నం పెట్టి పంపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సుధీర్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఎంతో సిన్సియర్‌గా వర్క్ చేస్తుంటారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటే చాలు అని సుధీర్ అన్నారు. ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. గెహ్నా నటన బాగుంది. భీమ్స్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

ఇంద్రజ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుధీర్ అమ్మానాన్నలు ఎంతగా సంతోషపడతారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను. సుధీర్ టాలెంట్ అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి సినిమాను చేశారు. ఆ కష్టం నాకు తెలుసు. ఇది అసలు సిసలైన నిజమైన సక్సెస్. సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన జనార్ధన్ గారికి థాంక్స్. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. నిర్మాత దర్శకులైన రాజశేఖర్ గారికి థాంక్స్. ఈ గాలోడు సక్సెస్‌కి సుధీర్ ఫ్యాన్స్ కారణం. ఈ సినిమాను వారంతా ఎక్కడికో తీసుకెళ్లారు. సుధీర్ గారి అభిమానులందరికీ థాంక్స్’ అని అన్నారు.

దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గాలోడు సక్సెస్ ఏ ఒక్కరిదో కాదు.. టీం అందరిది. అందరికీ మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నా. కథ రాయడం, సినిమా తీయడం, ప్రొడక్షన్ చేయడం ఈజీనే. కానీ సినిమాను రిలీజ్ చేయడమే చాలా కష్టం. మాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ జనార్థన్ గారికి థాంక్స్. మళ్లీ సినిమా తీసి, సక్సెస్ కొట్టి.. ఇలా కలుస్తాను అని అనుకుంటున్నాను’ అని అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాకు పెట్టిన ప్రతీ రూపాయి వెనక్కి వచ్చాకే సక్సెస్ మీట్ పెడదామని అన్నాను. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరిది ఈ విజయం. ఇన్ని థియేటర్లో నా సినిమా రిలీజ్ అవుతందని అనుకోలేదు. దీనికి కారణమైన జనార్ధన్ గారికి థాంక్స్. ఆయనకు రుణపడిపోయాను. నేను అభిమానులు అని అనను. నా ఫ్యామిలీ అంటారు. ఈ విజయం ప్రతీ ఒక్కరిదీ. ప్రతీ ఒక్క ఇంట్లో ఉండే వారిది. ప్రతీ తల్లిదండ్రులది. ఎందుకంటే వారు నన్ను కొడుకులా చూశారు. ఈ సినిమా వాళ్ల సినిమా అనుకుని చూశారు. ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి పాదాభివందనం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈరోజు ఇక్కడకు వచ్చిన ఇంద్రజ గారికి థాంక్స్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను నమ్ముకున్న ఏ ఒక్కరికీ నష్టం రాలేదు. పెట్టిన రూపాయి వెనక్కి వచ్చింది. ఇప్పుడు చాలా గర్వంగా మేం అంతా కూడా ఈ సినిమా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. గెహ్నా గారికి మున్ముందు ఇంకా మరిన్ని విజయాలు చేకూరాలి. సినిమాను ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ప్రతీ సినిమా బాగుండాలి.. అన్ని సినిమాలు చూడండి.. ఇక్కడకు వచ్చినందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago