అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ చిత్రాల్లో NC 22 ప్రాజెక్ట్ ఒకటి.
తారాగణం, అద్భుతమైనసాంకేతిక విభాగం ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్ తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్ లో నాగ చైతన్య పోలీస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు.
నాగచైతన్య తోటి అధికారుల చేతుల్లో లాక్ చేయబడినట్లు కనిపిస్తున్నాడు. అతని ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గురిపెట్టడం గమనించవచ్చు. ఈ ఇంటెన్స్ లుక్.. ఫస్ట్ లుక్ పై అంచనాలను పెంచింది. ఫస్ట్ లుక్ నవంబర్ 23 తేది ఉదయం 10:18 గంటలకు చైతన్య పుట్టినరోజు సర్ ప్రైజ్గా విడుదల కానుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…