నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

Must Read

హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో చిరంజీవి హాజరుకానున్నారు.

వెంకటేష్, విశ్వక్ సేన్, కన్నడ పరిశ్రమ నుంచి శివ రాజ్ కుమార్, ఉపేంద్ర కుటుంబం తదితరులు

సుచిర్ ఇండియా కిరణ్ : జై బాలయ్య! నేను ఇక్కడ ఒక స్పాన్సర్గా కాదు, ఒక అభిమానిగా వచ్చాను. బాలయ్య బాబుని ఎన్ని సార్లు చూసినా ఒక ఎనర్జీ వస్తుంది. నటుడిగా, మానవత్వం ఉన్న మనిషిగా, రాజకీయ నాయకుడిగా ఏంతో ఉన్నత స్థాయికి వెళ్లిన మీరు ఇలాగే 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.

నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నోవాలెట్‌ ఆడిటోరియమ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
దీనికి నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో చిరంజీవి హాజరుకానున్నారు.

బోయపాటి శ్రీను గారు : తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాల కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్, ఏటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారికోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది.

అనిల్ రావిపూడి : బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుండి పుట్టేస్తాయ్, బాడీ లాంగ్వేజ్ నుండి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయనాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం.

బుచ్చి బాబు: ఈరోజు ఇంతకంటే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి ఉండదు. జై బాలయ్య

కందుల దుర్గేశ్ (సినిమాటోగ్రఫీ మినిస్టర్) : సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాల పాటు యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య సేవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను.

తమన్: అఖండ, వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు గాను నాకు చాలా సంతోషం, జై బాలయ్య

సుమలత: నేను బాలయ్య గారితో 2 సినిమాలలో నటించాను. బాలయ్య నాకు తెలిసినంత వరకు చాల సింపుల్ గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.

దిల్ రాజు : జై బాలయ్య

కమల్ హాసన్ (వీడియో) : సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకుని వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే, ఆయన తండ్రి ఎన్టీఆర్ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బావుండాలి అని కోరుకుంటున్నాను.

మంచు విష్ణు : మీ గురించి చెప్పాలి అంటే సమయం సరిపోదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాల అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా గారు వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరు చేయలేనిది.

రానా దగ్గుబాటి : నేను బల కృష్ణ గారి సినిమా విడుదల రోజున పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య

విజయ్ దేవరకొండ : బాలయ్య గారు 50 ఏళ్ల ఇలా నటనా రంగంలో ఉండటం, వైద్య రంగంలో ఇలా సేవ చేయడం మేము చూస్తూనే పెరిగాం. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పటల్ లో చికిత్స పొందరు. నేను తొలిసారి లైగర్ షూటింగ్ లో కలిసాను. మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి.

సిద్దు జొన్నలగడ్డ : కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసినది ఏంటి అంటే బాలయ్య గారు ఎవరిని అయిన నిజాయితీగా ఉంటే కచ్చితంగా ఇష్టపడతారు. మీ అనుభవం అంతా లేదు నా వయసు. మీరు నాకు ఇన్స్పిరేషన్.

అల్లరి నరేష్ : బాలయ్య గారు చాల సరదా మనిషి. మీ 50 ఏళ్ల ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషం.

అడివి శేష్ : చిన్నప్పుడు మీ పాటలకు డాన్స్ లు చేసే వాళ్ళం. ఈరోజు మీ గురించి ఇలా మీ గురించి మాట్లాడటం చాల సంతోషం.

MP భరత్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల వల్ల చంద్ర బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. బాలయ్య గారు 50 ఏళ్లు సినిమాలు చేసి కూడా ఇంకా ఇలా అన్నారు అంటే చాల గ్రేట్. ఆయన ఈ వయసులో కూడా దూకేస్తు ఉంటారు. అది బాలయ్య గారి ధైర్యం. ఆయన 3 సార్లు ఎంఎల్ఏగా గెలిచి చూపించారు. ఆయన నట, సేవ, రాజకీయం మూడు బ్యాలెన్స్ చేయడం చాల కష్టం కానీ ఆయన చేస్తున్నారు. 50 సంవత్సరాలు బాలయ్య గారిని అభిమానులు ఇలా గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఆయన ప్రతి రంగంలో మరింత బాగా చేయాలని, ఆయనకు అల్లుడు అయినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

పెమ్మసాని : రికార్డులు బద్దల కొడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుగారికి కృత్ఞతలు. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీరే మా ఇన్స్పిరేషన్. కుటుంబంతో ప్రేమగా మెలగడంలో, వయసు పెరుగుతున్న కూడా తరానికి తగ్గట్లు మారడంలో మీరు మాకు ఒక ఆదర్శం.

మంచు మోహన్ బాబు : భారత దేశంలో నలుమూలల నుండి వచ్చిన అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి నటుడిగా విభిన్నమైన, విశిష్టమైన నటుడు బాలయ్య. 500 రోజులకు పైగా ఒక సినిమా ఆడటం అనే ఘనత బాలయ్యదే. 3 సార్లు హిందూపూర్ ఎంఎల్ఏగా ఎన్నికవడం చాల ఆనందకరం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

శివ రాజ్ కుమార్: మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఆయనకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేము చెన్నైలో ఉన్నప్పటి కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాం.

వెంకటేష్ : ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. ‘ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు.’

చిరంజీవి : బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య.

నందమూరి బాలకృష్ణ : ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అంతగానే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా వారు అంత చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడిఉంటాను. అలాగే నా భార్య వసుంధరకు ధన్యవాదాలు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News