టాలీవుడ్

‘దసరా’కు  U/A సర్టిఫికేట్ –  పర్ఫెక్ట్ రన్‌టైమ్ లాక్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా‘ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని కూడా పూర్తి చేసుకుంది. దసరాకు సెన్సార్ బోర్డ్  యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

సినిమా రన్ టైమ్ 2:36 గంటలుగా లాక్ చేశారు. ఇలాంటి జానర్‌ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్. టీజర్, ట్రైలర్‌లో చూసినట్లుగా కథకు భారీ స్పాన్ ఉంది. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్, రస్టిక్ లవ్ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్, అందరినీ కదిలించే భావోద్వేగాలు ఇందులో వున్నాయి.  

డి-గ్లామరస్‌గా కనిపించే ఛాలెంజింగ్ పాత్రను పోషించారు నాని. పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా ప్రవర్తించే అనూహ్య పాత్రలో కనిపిస్తారు. ధరణిగా అతని పవర్-ప్యాక్డ్ షో సినిమా బిగ్గెస్ట్ యూఎస్ పి లలో ఒకటిగా ఉంటుంది. అలాగే వెన్నెలగా కీర్తి సురేష్ పాత్ర దసరా లో చాలా సర్ప్రైజింగ్ ఉండబోతుంది. దీక్షిత్ శెట్టి నాని స్నేహితుడిగా కనిపించనున్నారు. సముద్రఖని పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది. నిజానికి సినిమాలోని ప్రతి పాత్రకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది.

సత్యన్ సూర్యన్ ప్రతి సన్నివేశాన్ని అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించగా, సంతోష్ నారాయణన్ తన మ్యూజిక్ మాయాజాలంతో సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్ చేశారు. సినిమా ప్రధాన భాగాన్ని పల్లెటూరి నేపధ్యంలో రూపొందించారు. భారీ ఖర్చుతో  22 ఎకరాల్లో సహజమైన పల్లెటూరి వాతావరణం రిక్రియేట్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు.    ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌ తో ‘దసరా‘ని అద్భుతంగా నిర్మించారు. అది ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.

ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే. సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయి.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago