ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్‌లోనూ ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న అరుదైన నటుడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రం మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో ఆయన్ని ప్రెజెంట్ చేయబోతోంది. విలక్షణమైన కథలను ప్రయత్నించే నాని తన మైల్ స్టోన్ 30వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
#నాని30 వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందబోతుంది. మోహన్ చెరుకూరి (సివిఎం) తన స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ..మంచి కంటెంట్ సినిమాలు తీయడానికి, బిగ్ స్క్రీన్‌పై వారి కథ-కథనంతో వైవిధ్యం చూపాలనే దృక్పథంతో ఈ బ్యానర్‌ను ప్రారంభించారు.
ఈ ముగ్గురూ వివిధ సొంత వెంచర్లు కలిగివున్నారు. చిన్ననాటి నుండి వీరికి సినిమాలపై ప్రధాన ఆసక్తి. వారి నిర్మాణంలో మల్టీపుల్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేశారు. తొలి చిత్రంగా నాని 30వ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమకు అవకాశం ఇచ్చిన నానికి కృతజ్ఞతలు తెలిపారు.
నాని కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా విలక్షణమైన చిత్రం అవుతుంది. మేకర్స్ జనవరి 1వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తారు.
ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌లో, నాని కుర్చీలో కూర్చుని తన ఫోన్‌లో బ్రౌజ్ చేస్తున్నాడు.
#నాని30కి సంబంధించిన దర్శకుడు, ఇతర ముఖ్యమైన వివరాలు న్యూ ఇయర్ సందర్భంగా తెలియజేస్తారు.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…