నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి.
సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ‘దసరా’ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. దూమ్ ధామ్, ఓరి వారి, చమ్కీల అంగీలేసి పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు దసరా నుంచి నాలుగో సింగల్ ‘ఓ అమ్మలాలో’ పాటని విడుదల చేశారు మేకర్స్.
ధరణి, వెన్నెల అందమైన బాల్యాన్ని చూపిస్తూ మనసుని హత్తుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంతోష్ నారాయణ్. ఈ పాటకు రెహమాన్ అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాల్య మధుర స్మృతులని, మరపురాని జ్ఞాపకాలని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని హార్ట్ టచ్చింగా ఆలపించారు.
కీర్తి సురేష్ కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించారు.
ప్రతిభావంతులైన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటర్ .
విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది.
| ReplyForward |
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…