బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. మర్డర్ మిస్టరీ క్రేౖం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు.‘నటనటనటరత్నాలు ఛాన్స్ ఇస్తే పండిస్తా నవరసాలు’’ అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్‌ను డా. సుప్రీం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర పాల్గొన్నారు.
శంకర్ మహాదేవ్ స్వరకల్పనలో వినాయక్ ఈ పాటను ఆలపించారు. సీతారామ చౌదరి సాహిత్యం అందించారు.
దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల ముందు తాగుబోతు రమేశ్‌పై తెరకెక్కించిన పాటను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్‌లపై తెరకెక్కించాం. ఈ పాటకు కూడా స్పందన బావుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా స్పందన బావుంది. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌లో మంచి డేట్ చూసి సినిమా విడుదల చేస్తాం. పాటను విడుదల చేసిన సముద్ర, సుప్రీమ్‌గారికి కృతజ్ఞతలు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని అన్నారు.
వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్ వింటుంటూ సూపర్‌హిట్టైన జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు తెలుసు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. చక్కని ఆర్టిస్ట్‌లు నటించారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అని అన్నారు.
డా.సుప్రీమ్ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా, పాటలు చూశా. చాలా బాగా వచ్చింది. నాన్న తన చిత్రాలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు. ఈ సినిమా కూడా ఆ తరహాలోనే చేశారు’ అని అన్నారు.
అర్చన,
శృతిలయ,
సుమన్ శెట్టి,
టైగర్ శేషాద్రి,
చంటి, అట్లూరి ప్రసాద్,
ఖమ్మం సత్యానారాయణ,
సూర్య కిరణ్, ఎంఎన్‌ఆర్ చౌదరి, రంజిత్ కుమార్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
లిరిక్స్: సీతారామ చౌదరి
ఎడిటర్: ఆవుల వెంకటేష్
సంగీతం: శంకర్ మహాదేవ్
పీఆర్వో: మధు విఆర్
సహా నిర్మాతలు: ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ, వై.చంటి, కోయ సుబ్బారావు
నిర్మాత: డా దివ్య
దర్శకత్వం: శివనాగు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…