స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని, అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేయాలని అన్నారు నారా  భువనేశ్వరి. మహిళలకు చేయూతను ఇచ్చేలా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా మహిళలు తయారు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా

నారా భువనేశ్వరి మాట్లాడుతూ – స్త్రీ అంటే ప్రేమ, ధైర్యం, శక్తి. మహిళలకు ఒక రోజు మహిళా దినోత్సవం అని జరుపుతుంటారు. కానీ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు జూట్ బ్యాగ్స్, బ్యూటీషియన్ కోర్స్ లు, టైలరింగ్ ట్రైనింగ్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీ..ఇలా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసేలా శిక్షణ ఇస్తున్నాం. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని శిక్షణ పొందిన మహిళలు ఏం చేస్తున్నారని వెళ్లి చూస్తే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ఒక్కచోట చేర్చి, వారి ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురావాలనే ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించాం. ఈ స్టోర్ ద్వారా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. దీని ద్వారా వచ్చిన ఆదాయమంతా ఆయా మహిళలకే చెందుతుంది. మహిళ తన దగ్గర ఏ కొంత డబ్బు ఉన్నా, తన కుటుంబానికి మంచి వంట చేయాలని, ఏదో ఒకటి కొనివ్వాలని, వాళ్లను సంతోషపెట్టాలనే చూస్తుంటుంది. అలా ఒక మహిళ మాత్రమే ఆలోచించగలదు. కానీ మీ ఆదాయంలో మీరు కూడా కొంత ఖర్చు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్టు నుంచి పుష్ కార్ట్స్, ఫుడ్ కార్ట్స్, టైలరింగ్ మిషీన్స్, ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. నేను కూడా మీలాగే గృహిణిగా ఉన్నాను, ఆ తర్వాత ధైర్యంగా అడుగువేసి కంపెనీని నిర్వహిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. సునీత విలియన్స్, మేరీ కోమ్, సుధామూర్తి..ఇలా ఎందరో మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇటీవల మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెల్చింది. మీరంతా స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ద్వారా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నా. అన్నారు.

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

8 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago