‘సరిపోదా శనివారం’ తో ఈ మంత్ ఎండ్ అదిరిపోతుంది స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ విజల్ వర్తీ ట్రైలర్ లాంచ్

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రజెంట్ చేసింది. సిఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

వివేక్ ఆత్రేయ 2.0 లోడ్ అయ్యింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్ ని రివిల్ చేస్తోంది. మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది, పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.

నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అనిపించింది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది.

మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్-వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే వుంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం’. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు,

యాక్టర్ SJ సూర్య మాట్లాడుతూ.. మీ అందరిని కలవడం ఆనందంగా వుంది. ట్రైలర్ కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్ తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని గారి ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య గారు చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.

హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. చాలా రోజుల మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. నాని గారితో గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి’ అన్నారు.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ.. సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని గారు సూర్య గారు కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్ బస్టర్’ అన్నారు

హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ .. ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ చాలా బావున్నాయి, నాకు చాలా నచ్చాయి. నాని సూపర్ గా చేశారు. సూర్య సర్ స్వాగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 29 న ఫీస్ట్ వుంటుంది’ అన్నారు.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago