నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 మేకర్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్‌ను లాంచ్ చేయడంతో స్పెషల్ ట్రీట్‌ను అందించారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి ఫైర్ తో, కుర్చీపై కూర్చున్న కళ్యాణ్ రామ్ తన చుట్టూ గూండాలని ఇంటెన్స్ గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తోంది. స్టైలిష్ మేకోవర్ అయిన కళ్యాణ్ రామ్ వెరీ వైలెంట్ గా కనిపిస్తున్నారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న #NKR21 చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేయనున్నారు. నందమూరి హీరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా డైనమిక్ క్యారెక్టర్‌ని పోషిస్తోన్నారు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ : రామ్ ప్రసాద్
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…