అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ నుంచి ‘నమో ఈశ్వర’ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.  

ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ నమో ఈశ్వర సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్  భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని  పవర్ ఫుల్ స్పిరిట్యుయల్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. శ్రీనివాస మౌళి పత్రి లిరిక్స్ గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని చాటాయి. స్వరాగ్ కీర్తన్ తన పవర్ ఫుల్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.

ఈ సాంగ్ లో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. సాంగ్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ‘నమో ఈశ్వర’ కార్తీక మాసంలో పర్ఫెక్ట్ లో శివుని సాంగ్ గా ఆకట్టుకుంది.

డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌.

దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

4 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

4 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

5 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

5 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

5 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

7 days ago