సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ నమో ఈశ్వర సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని పవర్ ఫుల్ స్పిరిట్యుయల్ ట్రాక్ గా కంపోజ్ చేశారు. శ్రీనివాస మౌళి పత్రి లిరిక్స్ గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని చాటాయి. స్వరాగ్ కీర్తన్ తన పవర్ ఫుల్ వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.
ఈ సాంగ్ లో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. సాంగ్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ‘నమో ఈశ్వర’ కార్తీక మాసంలో పర్ఫెక్ట్ లో శివుని సాంగ్ గా ఆకట్టుకుంది.
డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.
దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస
సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…