విరాట్ కర్ణ, అభిషేక్ నామా, కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’

విరాట్ కర్ణ, అభిషేక్ నామా, కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’- అద్భుతమైన శివాలయం సెట్‌లో గణేశ్ ఆచార్య మాస్టర్ కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు.

నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి.

బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు భారతీయ సినీ తెరపై చూడని రీతిలో ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు నాగబంధం సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా నిలవనున్న డివోషనల్ సాంగ్ “ఓం వీర నాగ” ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ అద్భుతంగా రూపుదిద్దారు.  అభే & జునైద్ కుమార్ గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ ఇచ్చారు, శ్రీ హర్ష లిరిక్స్ రాశారు. పాపులర్ బాలీవుడ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించింది.

సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుంది.  

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S  సినిమాటోగ్రఫీ,  ఆర్ సి ప్రణవ్ ఎడిటర్.

నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో ప్రారంభం కానున్నాయి.

తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఈశ్వర్య మీనన్, జగపతి బాబ్, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్, తదితరులున్నారు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్
CEO: వాసు పోతిని
PRO : వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

9 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago