నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి షూటింగ్ ప్రారంభం

Must Read

హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇది శౌర్య హై-బడ్జెట్ ప్రాజెక్ట్‌గా వుండబోతోంది. యూనివర్సల్ అప్పీల్‌ వున్న కథ, బిగ్ హిట్ తో పాటు శౌర్యకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కాబోతున్న ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది.

సినిమా నిర్మాణంపై పాషన్ ఉన్న బిజినెస్ మ్యాన్ చింతలపూడి శ్రీనివాసరావు క్యాలిటీ చిత్రాలను నిర్మించి కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకురావాలనే తపనతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తను రమేష్ కథతో మెస్మరైజ్ అయ్యారు. రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 

నటీనటులు: నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)

నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి

బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్

డీవోపీ: రసూల్ ఎల్లోర్

సంగీతం: హారిస్ జైరాజ్

ఆర్ట్: రాజీవ్ నాయర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పృథ్వీ

కొరియోగ్రాఫర్లు: రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, VJ శేఖర్, శోబి పాల్రాజ్

లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: సుధాకర్ వినుకొండ

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి అక్టోబర్ 4న

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు,ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది....

More News