‘కల్కి‘ కోసం మూడు లోకాలు సృష్టించిన నాగ్ అశ్విన్

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన ‘భైరవ అంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది.  ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 – ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD  మరింత క్యురియాసిటీ పెంచింది. ఈ రోజు మేకర్స్ వరల్డ్ ఆఫ్ కల్కి 2898 AD – ఎపిసోడ్ 2 ని రిలీజ్ చేశారు.  

వరల్డ్ ఆఫ్ కల్కి 2898 AD – ఎపిసోడ్ 2లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ స్టార్ట్ చేశాం. కలియుగం ఎండింగ్ లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ వుంటే ఎలా వుంటుంది, నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రస్టింగా వుంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. కాశీని బిల్డ్ చేయడం వెరీ లాంగ్ ప్రాసెస్.

కాశీపైన పిరమిడ్‌ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ వుంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్‌ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్, ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా వుంది. అదే  శంబాల. ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్ గా వుంటుంది. కాశీకి కాంప్లెక్స్‌ కి సంబంధం లేని థర్డ్ వరల్డ్. ఈ వరల్డ్ వున్న వారు కాంప్లెక్స్‌ లో వున్నవారిని ఛాలెంజ్ చేస్తుంటారు. ఈ వరల్డ్ లో గాడ్ అనే ఐడియా వుండదు. గాడ్ ని బ్యాన్ చేసి వరల్డ్. ఈ మూడు వరల్డ్స్ మధ్య మన కథ నడుస్తుంది. ఒకొక్క వరల్డ్ ని ఒకొక్క థాట్ ప్రాసెస్ తో డిజైన్ చేశాం. కాశీలో ప్రజలు, వెహికిల్స్, కరెన్సీ, ఫుడ్, వెపన్స్ ఒకలా వుంటాయి. కాంప్లెక్స్‌లో ఒకలా వుంటాయి. శంబాలా కంప్లీట్ డిఫరెంట్. ఒకొక్కరు ఒక్కో కల్చర్. శంబాలా లో దేవుడు మళ్ళీ పుడతాడనే ఒక బిలిఫ్ వుంది. కల్కి అవతారం శంబాలా లో పుడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్ లో వుంది. ఈ మూడు వరల్డ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది’ అన్నారు  

‘కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్  2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago