‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ టాప్-క్లాస్ టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.
ఈ చిత్రంలో సంయుక్త ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ వర్క్ లో చేరారు. ఈ మాస్టర్‌పీస్‌లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె బోర్డులోకి వచ్చారు. మేకర్స్ ఆమె లుక్ ని రివిల్ చేశారు. నభా గాయం నుంచి కోలుకుని టీంలో చేరినట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరలో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. అది పోస్టర్‌లో ఆమె గెటప్, లుక్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ లో నభా నటేష్ కూడా చేరారు.
తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగారి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
కొత్త టెక్నిషియన్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు కౌంట్ డౌన్…
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…