సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ – విశ్వనాథ్ గారితో విశ్వనాథామృతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిశాం. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుంటారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు , ఆ పాటల వెనక సీతారామశాస్త్రి గారు చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశాం. సీతారామశాస్త్రి గారు తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు. కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్ తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాం. దీన్ని టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇతర పనులతో బిజీగా ఉండి శాస్త్రి గారు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కొన్ని రోజులకు సీతారామశాస్త్రి గారు మనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఎలా ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు మా టీమ్ లోని వాళ్లంతా శాస్త్రి గారి అభిమానులే. సీతారామశాస్త్రి గారి మాట అందరికీ చేరాలని చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి మాట్లాడుతూ – మనమంతా ఒక కారణంతో ఈ భూమ్మీదకు వస్తాం. అలా ఒక బృహత్తరమైన బాధ్యతతో పుట్టారు అన్నయ్య సీతారామశాస్త్రి. తన కర్తవ్యాన్ని ముగించి వెళ్లిపోయారు. ఉన్నంతకాలం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విలువైన పాటలను మనకు అందించారు. ఆ పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. అన్నయ్య సినిమా పాటల రచయిత కాకుండా ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవారని కొందరు అంటారు కానీ అన్నయ్య ఆ మాట ఒప్పుకోడు. సినిమా మాధ్యమం వల్లే ఇంత విస్తృతంగా తన పాట ప్రజల్లోకి వెళ్లిందని అనేవారు. అన్నారు.

సింగర్ పార్థసారధి మాట్లాడుతూ – సీతారామశాస్త్రి గారి లాంటి గొప్ప గేయ రచయిత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. ఆయన పాటలు పాడే గొప్ప అవకాశం నాకు రావడం గర్వంగా భావిస్తున్నా. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది పూర్తి చేయగలమా అనే భయం ఉండేది. నేను చేయగలనా అనే సందేహం కలిగినప్పుడు శ్రీరామ్ ధైర్యం చెప్పేవారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రి గారి అభిమానులు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు మాకు సపోర్ట్ చేశారు. సిరి డెవలపర్స్ మూర్తిగారు, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి గారు, వీళ్లందరి సపోర్ట్ తో ముందుకెళ్లాం. శాస్త్రి గారి పాటలను, మాటలను చిరకాలం నిక్షిప్తం చేయాలనేది మా ప్రయత్నం. అన్నారు.

డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ – నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్నందుకు కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల మధ్య గడిపినందుకు గర్విస్తున్నాను. మా పాపతో మేము నిర్మించిన లిటిల్ సోల్జర్స్ సినిమాలో మొత్తం పాటలు శాస్త్రి గారే రాశారు. మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలతోనే గొప్ప పాటలు రాసిన గ్రేట్ రైటర్ శాస్త్రి గారు. కృష్ణవంశీ గారు, శాస్త్రి గారి కాంబోలో చాలా మంచి పాటలు వచ్చాయి. మా సన్ షైన్ ఆస్పత్రి ఆడిటోరియంలో సెట్ వేసి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ – నాకు సీతారామశాస్త్రి గారు చాలా కాలంగా తెలుసు. ఆయన పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా.
నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లి పాటల గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి గారు లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోంది. శాస్త్రి గారి గురించి ఇంత మంచి ఈ కార్యక్రమం శ్రీరామ్ కు , పార్థసారధి నా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – సీతారామశాస్త్రి ప్రోగ్రాం మీరు మీడియా కార్యక్రమం నిర్వహించాలని అడిగినప్పుడు అది అదృష్టంగా భావించా. సీతారామశాస్త్రి గారు గొప్ప సినీ రచయిత. దర్శకుల మనసు తెలుసుకుని, వారికి ఏం కావాలో అది రాసిచ్చే లిరిసిస్ట్. కృష్ణవంశీ గారికి ఆయన చిరకాలం గుర్తుండే పాటలు రాశారు. శాస్త్రి గారు మనకు దూరమైనప్పుడు వచ్చిన అశేష జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమంతో శాస్త్రి గారి పాట, మాట ప్రేక్షకులకు విస్తృతంగా చేరాలని కోరుకుంటున్నా. అన్నారు.

Tfja Team

Recent Posts

సునీల్, అఖిల్ ఉడ్డెమారిల సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్ – సినిమా ఆగస్టు 21న వరల్డ్‌వైడ్ రిలీజ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న…

7 hours ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి రివర్స్ టీజర్ రిలీజ్

తొలిసారి రివర్స్ టీజర్ తో సరికొత్త ప్రయత్నం చేసి ఆకట్టుకుంటున్న "ది మేజ్" మూవీ మేకర్స్ తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో…

7 hours ago

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది – దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

7 hours ago

‘మండాడి’ నుంచి సోల్ ఫుల్, మెలోడీ ‘తెలుసా నీకే పిల్లా’ సాంగ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం…

7 hours ago

పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ…

8 hours ago

అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని-సూర్యతేజ వివాహం

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో…

13 hours ago