మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేసిన పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ ‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్
అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ట్రైలర్ అద్భుతంగా ఉంది. హీరోగా దర్శకునిగా అముద శ్రీనివాస్ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది.
నటీనటులు అంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రం నిర్మాత పోత్నాక్ శ్రవణ్ మంచి లాభాలు రావాలి. హీరో దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలి. చిత్ర యూనిట్ అందరికీ శుభాభినందనాలు’ తెలిపారు.
ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు : అముద శ్రీనివాస్. కారుణ్య చౌదరి, రమ్య, అజయ్ ఘోష్, షఫీ, అన్నపూర్ణమ్మ, ఫిష్ వెంకట్ జబర్ దస్త్ ఫణి, నాగిరెడ్డి. బస్ స్టాప్ కోటేశ్వర రావు, మాధవి, వేములూరి రాజశేఖర్, హరి తదితరులు
టెక్నికల్ టీం :
నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్
రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్
డివోపీ: ఎంఎస్ కిరణ్ కుమార్
సంగీతం : ఎంఎల్ పి రాజా
ఆర్ఆర్ : చిన్నా
ఎడిటర్ : నందమూరి హరి
పీఆర్వో : వంశీ శేఖర్
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…