ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్’. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భముగా ఈ రోజు ఫిలింఛాంబర్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ…‘‘ ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తును ప్రమోషన్ చేసి భారతీయులు ఉన్న ప్రతీచోట పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్ చేయాలి. దానికోసం ఆన్‌లైన్ , డిజిటల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలి. ఇక రివెంజ్ సినిమా విషయానికొస్తే..బాబు పెదపూడి సినిమా పై పాషన్‌తో అమెరికా నుండి ఇండియా కొచ్చి ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశారు. సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఇంకా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అన్నారు.
తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ….‘‘సినిమా మీద పాషన్‌తో బాబు పెదపూడి ఈ సినిమా చేశారు. నటిస్తూ స్వయంగా నిర్మించారు. కమల్ హాసన్‌గారి ‘ఎర్రగులాబీలు’ తరహా కాన్సెప్ట్‌తో అన్ని వర్గాలకు నచ్చేలా ‘రివెంజ్’ సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు మంచి పేరు వస్తోంది. ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటూ దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.
రివెంజ్ చిత్ర నిర్మాత, నటుడు బాబు పెదపూడి మాట్లాడుతూ..‘‘అమెరికా వెళ్లి దాదాపు 35 ఏళ్లు అవుతోంది. సినిమాలంటే మొదటి నుంచి ఉన్న ఆసక్తితో మహేష్ గారు నటించిన ‘అతడు’ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ గారు రివెంజ్ స్టోరి చెప్పడంతో నచ్చి నటిస్తూ ఈ సినిమా నిర్మించా. ఈ శుక్రవారం విడుదలైంది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చూసిన వారంతా ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. మా డైరక్టర్ చాలా కష్టపడ్డారు. మా చిత్రాన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ…‘‘ప్రొడ్యూసర్ బాబు పెదపూడి గారితో ఐదేళ్ల ప్రయాణం. నన్ను, నా కాన్సెప్ట్ నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమా చేయడానికి స్వేఛ్చనిచ్చారు. ఈ శుక్రవారం విడుదలైన మా చిత్రానికి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. చూసిన వారంతా సినిమా చాలా బావుందంటున్నారు. త్వరలో థియేటర్స్ కూడా పెంచుతున్నాం. అలాగే యుఎస్‌లో కూడా సినిమాను విడుదల చేయడానికి మా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు ధన్యవాదాలు’’ అన్నారు.
దర్శకుడు, నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…‘‘దర్శకుడు నాకు చాలా కాలంగా తెలుసు. ప్రతిభావంతుడు. నిర్మాత బాబు పెదపూడి గారు ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. పాజిటివ్ టాక్‌తో సినిమా రన్ అవుతోంది’’ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ రివెంజ్ చిత్రం సక్సెస్ మీట్ పెట్టారంటే సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుందని అర్ధమైంది. నిర్మాత కు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వడ్లపట్ల మోహన్, నాగులపల్లి పద్మిని పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు’’ తెలిపారు.
బాబు పెదపూడి, నేహదేశ్ పాండే, ఆరోహి, భార్గవ్, నాగేష్ కర్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డిఓపిః చిడతల నవీన్; సంగీతంః విజయ్ కురాకుల; పీఆర్వోః రమేష్ చందు; ఎడిటర్ః మేనగ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA) రచన-దర్శకత్వంః రెట్టడి శ్రీనివాస్.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…