వాల్తేర్ వీరయ్యనుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి అప్డేట్ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది.

‘వాల్తేర్ వీరయ్య’ నుండి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్-  బాస్ పార్టీ సాంగ్ రేపు విడుదలౌతున్న  సంగతి తెలిసిందే. దాని కంటే ముందు చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ఈ పాట చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్ ని ప్రజంట్ చేసింది. ప్రోమో పాటను చూడాలనే ఉత్సాహాన్ని పెంచింది.

ప్రోమోలో చిరంజీవి గళ్ళ లుంగీ, కలర్ ఫుల్ షర్ట్ లో తనదైన స్టయిల్ లో నడుస్తూ మెగా మాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో కనిపించిన మెగా వాకింగ్ స్టయిల్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. అయితే మాస్ మూల విరాట్ దర్శనం కోసం పాట విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మాస్ ని ఆకట్టుకొనే అదిరిపోయే ట్యూన్ ని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు నకాష్ అజీజ్, హరిప్రియతో పాటు ఆలపించారు.

మాస్ సాంగ్స్ స్పెషలిస్ట్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్. పాటను చిత్రీకరించిన భారీ సెట్ను కూడా ప్రోమోలో చూడవచ్చు. లిరికల్ వీడియో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.  

మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్ దేవరమానె ఎడిటర్గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago