నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా  వుంటుంది : దక్షా నాగర్కర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన దక్షా నాగర్కర్ విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

రావణాసుర కోసం నిర్మాత అప్రోచ్ అయ్యారు. మొదట ఇందులో పాత్ర లుక్ గురించి చెప్పారు. చాలా ఎక్సయిటింగా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం.  రవితేజ గారి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రావణాసురలో మీ పాత్ర ఎలా వుంటుంది ? నటనకు ఆస్కారం వుండే పాత్రేనా ?

రావణాసురలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ప్రస్తుతానికి అది సస్పెన్స్. నటన విషయానికి వస్తే.. పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ వుండే పాత్ర చేశాను.

క్రైమ్ థ్రిల్లర్ చేయడం మీకు కొత్త కదా ? ఎలా అనిపించింది ?

నేను ఎప్పుడూ కొత్తగానే చేయాలని ప్రయత్నిస్తాను. హోరాహోరిలో మెంటల్ డిస్టర్బ్ గా వుండే అమ్మాయి గా చేశాను. హుషారు లో దిల్ చహతహే తరహ పాత్ర, అలాగే జాంబిరెడ్డి తెలుగు లో మొదటి జాంబి ఫిల్మ్. రావణాసుర కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి సర్ ప్రైజ్ అవుతారు.

దర్శకుడు సుధీర్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఎలా ఫీలయ్యారు ?

సుధీర్ వర్మ గారి గత  చిత్రాలు చూశాను. చాలా డిఫరెంట్ గా వుంటాయి. రావణాసుర కథని కలర్ పేలేట్ తో సహా ఎలా వుంటుందో చెప్పారు. ఆయన చెబుతున్నపుడే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

ఇందులో చాలా మంది హీరోయిన్స్ వున్నారు కదా.. మీ పాత్రకు ఎంత ప్రాధన్యత వుంటుందో అనే సందేహం రాలేదా ?

నాకు అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రని ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ద్రుష్టిపెట్టాను. నా పాత్రతోనే ఇన్వాల్వ్ అయ్యాను.

రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ? ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు ?

రవితేజ గారు బిగ్ స్టార్, మాస్ మహారాజా. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. చాలా హంబుల్ గా వుంటారు. సెట్స్ లో చాలా సరదా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవం.

రావణాసుర బలాలు ఏమిటి ?

రవితేజ గారు, దర్శకుడు సుధీర్ వర్మ, సుశాంత్, డీవోపీ, మా టెక్నికల్ టీం ఇలా అందరం కష్టపడి ది బెస్ట్  ఇచ్చాం. 

సుశాంత్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

సుశాంత్ గారు చాలా సరదా మనిషి. ఈ సినిమాలో ఆయన్ని చాలా కొత్తగా చూస్తారు.

ఎలాంటి పాత్రలలో కనిపించాలని వుంది ?   

ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. చాలా నేర్చుకోవాలి. ఇటివలే ఒక యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. అందరి హీరోలతో కలసి పని చేయాలని వుంది.

కొత్తగా చేయబోతున్నా ప్రాజెక్ట్ ?

రెండు సినిమాలు సైన్ చేశాను. వివరాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago