వారి గురించి ఆలోచిస్తుంటేనే మనసు ఎంతో బాధగా ఉంది:నందమూరి రామకృష్ణ

Must Read

అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు
మన అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలలో పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఎంతోమంది సంఘీభావం తెలియజేస్తున్నారు. దేశ విదేశాలనుంచి సైతం చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తున్నారు. మేము సైతం సీబీఎన్తో అంటూ ముందుకు వచ్చి వారి వారి సంఘీభావాలు తెలియజేస్తున్నారు. యావత్ ప్రజానీకం ఇలా తమ సంఘీభావాన్ని తెలియజేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన వార్త విని చాలామంది షాక్ తో గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోయారు. వారి గురించి ఆలోచిస్తుంటేనే మనసు ఎంతో బాధగా ఉంది. వారందరూ ఎక్కడ ఉన్నా సరే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మా కుటుంబాల నుంచి ఆయా కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నాను.

మీ నందమూరి రామకృష్ణ

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News