సంగీత దిగ్గజం కోటి చేతుల మీదుగా ప్రణయగోదారి సాంగ్ విడుదల

సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కథలకు, నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్న సినిమాలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంటోంది. సరిగ్గా ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రణయగోదారి అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇక గోదావరి అందాలు, నాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసిన సీన్స్ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి. హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్‌తో పాటు సైడ్ డాన్సర్స్ లుక్స్ కూడా ఈ పాటలో ఆకర్షణీయంగా మారాయి.

ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇప్పటివరకు ప్రణయగోదారి మూవీ నుంచి వదిలిన పోస్టర్స్, ఈ సాంగ్ చూస్తుంటే టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరించారని తెలుస్తోంది. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు వెండితెరపై చూపించడమే గాక.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. యువతను ఆకర్షించే ఎన్నో పాయింట్స్ కలగలిపి రాబోతున్న ఈ సినిమాకు మార్కండేయ సంగీతం అందిస్తున్నారు. ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ: కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్: విజయకృష్ణ అందిస్తున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago