హీరో సుధీర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’ మేకర్స్ మురుగడి మాయ అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది.
చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నెంబర్ సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. మొత్తంమీద, మురుగడి మాయ అద్భుతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్ తో ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ బాబు , సునీల్ బాండింగ్ మరింత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.
ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో మాళవిక శర్మ కథానాయిక.
అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రవితేజ గిరిజాల. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…