‘డబుల్ ఇస్మార్ట్’ దిమాకికిరికిరి టీజర్ మే 15న విడుదల

డబుల్ ఇంపాక్ట్ తో ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ క్రియేట్ చేసే సమయం ఆసన్నమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్,  ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి  దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్  మాస్ యాక్షన్ ధమాకేధార్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు

టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌ని ఫేస్ మాస్క్‌తో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని కనిపించారు రామ్ దిమాకికిరికిరి టీజర్‌ ని ప్రామిస్ చేసే పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్ తో కనిపించారు.

ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది, ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొంటుంది. త్వర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నందున, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో ముందుకు రానున్నారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు,  జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

22 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

22 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

22 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago