‘ముర’ చిత్రం న‌వంబ‌ర్ 8న మూవీ గ్రాండ్ రిలీజ్‌

హ్రిదు హ‌రూన్‌, సూర‌జ్ వెంజారుముడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మ‌హ్మ‌ద్ ముస్త‌ఫా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ రియల్ రా యాక్ష‌న్ ఫిల్మ్ ‘ముర’ ట్రైల‌ర్ విడుద‌ల‌

క్రాష్ కోర్స్‌, ముంబైక‌ర్‌, థ‌గ్స్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ క‌థానాయ‌కుడు హ్రిదు హ‌రూన్, విల‌క్ష‌ణ న‌టుడు సూర‌జ్ వెంజార‌ముడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన రియల్ రా యాక్ష‌న్ ఫిల్మ్ ‘ముర’. క‌ప్పేల వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు మ‌హ్మ‌ద్ ముస్తఫా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 8న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్.. సోమ‌వారం రోజున మురా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

సాఫీగా సాగిపోతున్న న‌లుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం..ఓ వ్య‌క్తి కార‌ణంగా అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. దీంతో వారు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏంటి? వాటిని వారు ఎలా అధిగ‌మించార‌నేదే సినిమా కథాంశం. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కేర‌ళ, త్రివేండ్రంలో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు.

మ‌ల‌యాళంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. హ్రిదు హ‌రూన్‌, సూర‌జ్ వెంజారుముడు వెర్స‌టైల్ యాక్టింగ్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోనున్నాయి. ఇంకా ఈ చిత్రంలో మాలా పార్వ‌తి, క‌ని కుస్రుతి, క‌న్న‌న్ నాయ‌ర్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఫాజిల్ న‌జీర్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి క్రిస్టి జోబి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

న‌టీన‌టులు:

హ్రిదు హ‌రూన్‌, సూర‌జ్ వెంజారుముడు, మాలా పార్వ‌తి, క‌ని కుస్రుతి, క‌న్న‌న్ నాయ‌ర్‌, జోబిన్ దాస్‌, అనుజిత్ క‌న్న‌న్‌, యెదు కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్‌: రియా శిబు, ద‌ర్శ‌క‌త్వం: మ‌హ్మ‌ద్ ముస్త‌ఫా, ర‌చ‌న‌: సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రోనీ జ‌కారియా, సినిమాటోగ్ర‌ఫీ: ఫాజిల్ న‌జీర్‌, ఎడిట‌ర్‌: చ‌మన్ చ‌క్కో, మ్యూజిక్‌, బీజీఎం: క్రిస్టి జోబి, యాక్ష‌న్‌: పి.సి.స్టంట్స్‌, మేక‌ప్‌: రోనెక్స్ గ్జెవియ‌ర్‌, కాస్ట్యూమ్స్‌: నిసార్ రహ్మత్‌, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago