అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేమల్టీ జోనర్ ఫిల్మ్ “నేను – కీర్తన”

బ్యానర్; చిమటా ప్రొడక్షన్స్
ఫైట్స్: నూనె దేవరాజ్,
సినిమాటోగ్రఫీ; కె.రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎమ్.ఎల్.రాజా
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ)
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)

నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్ తదితరులు…

సెన్సార్ సర్టిఫికెట్: యు/ఎ

విడుదల తేది: 30-08-2024

ఇటీవల కాలంలో పెద్ద చిత్రాలకు ధీటుగా వార్తల్లో ఉంటూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన చిత్రం “నేను – కీర్తన”. స్వయంగా కథ – మాటలు – స్క్రీన్ ప్లే సమకూర్చుకుని.. చిమటా రమేష్ బాబు డైరెక్టర్ కమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “నాన్ స్టాప్ ఎంటర్’టైనర్”… “పైసా వసూల్ ఫిల్మ్” అంటూ చిత్రబృందం చేసిన ప్రచారానికి తగ్గట్టుగానే సినిమా ఉందా లేదా అనేది పరిశీలిద్దాం!!

తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆపదలో ఉండి, తన సాయం అర్ధించేవారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి అరాచకాలకు ఎదురొడ్డే జానీ అనే ఓ యువకుడి కథ “నేను కీర్తన”. జానీ జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాక… అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది, తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా… సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించాడన్నది క్లుప్తంగా కథ.
“మల్టీ జోనర్ ఫిల్మ్”గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసిన తీరు అభినందనీయం. అయితే… ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అక్కడక్కడా అనిపించినా… కథ మలుపులు తిరిగేకొద్దీ రక్తి కట్టిస్తుంది.

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్:

నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రమేష్ బాబు గురించి. వంకలు పెట్టడానికి వీలులేని నటనతో ఆద్యంతం ఆకట్టుకున్న రమేష్ బాబు… పోరాటాలు, నృత్యాల్లో కూడా రాణించాడు. ముఖ్యంగా ఇది అతనికి డెబ్యూ ఫిల్మ్ అంటే నమ్మలేనంత నేచురల్ గా నటించి మంచి మార్కులు స్కోర్ చేశాడు. కాకపోతే, రైటర్, డైరెక్టర్ కూడా తనే అయిన రమేష్ బాబు… పెద్ద హీరోలకయితే బ్రహ్మాండంగా పేలే డైలాగ్స్ రాసుకున్నాడు. అలాగే యాక్షన్ బ్లాక్స్ కూడా. విజయ రంగరాజు, జీవాల విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? బ్రహ్మాండంగా రక్తి కట్టించారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా అసహజత్వానికి, తావు లేకుండా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పని తీరు:

దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేసిన రమేష్ బాబు… రైటర్ గా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ మరీ హెవీ అయ్యాయేమో అనిపిస్తుంది. అలాగే… ముందే చెప్పుకున్నట్టు ఒక సినిమాలో అన్ని జోనర్లు చొప్పించడం అవసరమా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా… ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ చాలా బాగున్నట్లే. ఎం.ఎల్.రాజా బాణీలు, ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది. ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్, కులు మనాలిలో చిత్రీకరించిన పాట, పోరాటాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు!!

చివరిగా చెప్పాలంటే…
చిన్న చిన్న లోపాలున్నా… ఓవరాల్ గా ఎక్కడా విసుగు తెప్పించకుండా… చూస్తున్నంతసేపు చక్కని వినోదం అందించే చిత్రం “నేను – కీర్తన”.

రేటింగ్ : 3/5

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

13 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

14 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago