బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా రన్ అవుతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’
సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజైంది.
మేల్ ప్రెగ్నెన్సీ అనే యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చూసేందుకు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మూవీ రిలీజైన శుక్రవారం నుంచి డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఎమోషన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఈ సినిమా కొత్త తరహా మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మల్టీప్లెక్స్ లతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ ను మహిళా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. చాలా చోట్ల సన్నివేశాలు తమను కదిలించేలా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఫ్రైడే నుంచి స్ట్రాంగ్ గా ప్రారంభమైన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ బాక్సాఫీస్ జర్నీ ఈ వీకెండ్ కు మరింత ఊపందుకునేలా కనిపిస్తోంది. స్టార్స్ సినిమాలేవీ ఈవారం రిలీజ్ కాకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఒక కొత్త తరహా మూవీ చూడాలనుకునే మూవీ లవర్స్, ప్రేక్షకులకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మంచి ఆప్షన్ అనుకోవచ్చు
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…